/ “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”...

“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”...

ఉమ్ముల్ ము'మినీన్, విశ్వాసుల మాత అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

రమదాన్ మాసంలోని చివరి పది రాత్రులు ప్రవేశిస్తూనే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన మరియు విధేయత యొక్క పనులలో, ఆచరణలలో ఎక్కువగా శ్రమ పడేవారు. ఆయన (స) చాలా ఎక్కువగా వివిధ రకాలైన మంచి పనులను, వివిధ రకాలైన దాతృత్వ చర్యలను చేసేవారు, రమదాన్ నెల చివరి పది రాత్రుల గొప్పతనం, మరియు ఘనత కారణంగా ఆయన (స) మిగతా ఇతర సమయాలలో ఆచరించిన దాని కంటే ఎక్కువగా ఆరాధనలను ఆచరించేవారు.

Hadeeth benefits

  1. ఈ హదీథులో - సాధారణంగా రమదాన్ మాసం మొత్తములో, ప్రత్యేకించి చివరి పది రాత్రులలో, వివిధ రకాల విధేయతా ఆచరణలను, దానధర్మాలను పదేపదే చేయాలని ప్రోత్సహించబడింది.
  2. రమదాన్ మాసపు చివరి పది రాత్రులు – వాస్తవానికి రమదాన్ మాసపు ఇరవై ఒకటవ రాత్రి నుంచి మొదలై మాసము ముగియడంతో పరిసమాప్తమవుతాయి.
  3. విధేయతా ఆచరణలతో రమదాన్ మాసపు అత్యంత ఘనమైన సమయాలను ఒడిసిపట్టుకొనుట అభిలషణీయము.