- ఒక ముస్లిం తన వ్యవహారాలను నిశ్చితత్వం, స్థిరత్వం పైనే స్థాపించాలి మరియు సందేహాస్పదంగా ఉన్న దాన్ని వదిలి వేయాలి మరియు అతడు తన ధర్మాన్ని గురించి అంతర్ దృష్టి మరియు మంచి అవగాహన కలిగి ఉండాలి.
- సందేహాస్పదమైన మరియు అనుమానాలు రేకెత్తించే వ్యవహారాలలో పడరాదని నివారించబడింది.
- మీరు ప్రశాంతత మరియు సౌకర్యాన్ని కోరుకుంటే, సందేహాస్పదమైన వాటిని వదిలి వేయండి మరియు వాటిని ప్రక్కన పెట్టండి.
- అల్లాహ్ తన దాసులపై కరుణ, దయ కలిగి ఉంటాడు, ఆత్మకు మరియు మనస్సుకు శాంతిని కలిగించే వాటిని చేయమని ఆజ్ఞాపించాడు; ఆందోళన, అశాంతి మరియు గందరగోళాన్ని కలిగించే వాటిని వదిలి వేయాలని నిషేధించాడు.