- సకల శుభాల ప్రదాత, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ మనసులోనికి వచ్చే పరిపరి విధాల ఆలోచనలను, వ్యామోహాలను ఉపేక్షించినాడు, వదలివేసాడు, మరియు వాటిని క్షమించాడు. అవి వచ్చినపుడు మనిషి తనలో తానే మాట్లాడుకుంటాడు, లేక అవి అతని మనస్సులోనికి వచ్చి పోతూ ఉంటాయి.
- ఉదాహరణకు విడాకులు, ఒకవేళ ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన అతని మనస్సులోనికి వచ్చినట్లైతే, అతడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నట్లైతే, లేక ఏ కాగితం మీదనైనా రాసి ఉండకపోతే, అతడు విడాకులు ఇచ్చినట్లు భావించబడదు.
- ఒక వ్యక్తి, తన మనసులోనికి వచ్చి పోతూ ఉండే ఆలోచనలకు, వాటి గురించి తనలో తాను మాట్లాడుకొనుట పట్ల అతడు బాధ్యునిగా నిలబెట్టబడడు – అవి ఎంత గొప్ప ఆలోచనలైనా, లేక ఎంత ఘోరమైనవి అయినా – అవి అతని మనసులో స్థిరపడనంత వరకూ, వాటిపై అతడు అమలు చేయననంత వరకూ లేక వాటిని గురించి బయటకు మాట్లాడనంత వరకూ.
- ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ (సమాజం) యొక్క స్థితి, స్థాయి ఎంత గొప్పవి అంటే మన కంటే ముందు గడిచిన సమాజాలకు (ఉమ్మత్’లకు) భిన్నంగా మనసులోనికి వచ్చే పరిపరి విధాల ఆలోచనలకు, స్వీయసంభాషణకు జవాబుదారీగా నిలబెట్టకపోవడం. అది ఈ ఉమ్మత్ యొక్క ప్రత్యేకత.