అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అ...
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఘోరమైన పాపములను’ (అల్ కబాయిర్) గురించి తెలియజేస్తున్నారు. వాటికి పాల్బడిన వానిని ఈ ప్రపంచములో గానీ, పరలోకములో...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి వ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు: పునరుత్థాన దినమున ప్రజల మధ్య తీర్పు చేయబడే మొదటి విషయం – అన్యాయంగా, అధర్మంగా ఒకరిపై మర...
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అతి తీవ్రమైన హెచ్చరికను గురించి తెలియజేస్తున్నారు – అది ఎవరైతే ఒక ‘ముఆహద్’ ను – అంటే అతడు అవిశ్వాసుల ప్రద...
జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు: “బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంల...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను త్రెంచుకునే వాని గురించి వివరిస్తున్నారు. ఎవరైతే తన బంధువులతో బంధుత్వాన్ని త్రెంచుకుంటాడో లేక వా...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుటను గురించి ఉద్బోధిస్తున్నారు. బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుట, కొనసాగించుట అనేది తర...

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అల్లాహ్ కు సరిసమానులు చేయుట), తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; నిశ్చయంగా స్వర్గపు సుగంధము నలభై సంవత్సరాల (ప్రయాణపు) దూరము నుండి కూడా చూడగలిగినప్పటికీ. (ముఆహద్: ముస్లిముల రాజ్యములోనికి - తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే ఒప్పందముపై - ప్రవేశించిన వ్యక్తి).

జుబైర్ బిన్ ముత్’ఇం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు: “బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”.

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)”.

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు “అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. ఆయన “(‘గీబత్’ అంటే) మీ సోదరుని గురించి అతడు ఇష్టపడని విధంగా మాట్లాడడం” అన్నారు. వారిలో ఒకరు “నా సోదరుని గురించి నేను చెబుతున్నది నిజమే అయితే? దాని గురించి మీరు ఏమంటారు?” అని అడిగారు. దానికి ఆయన “నీ సోదరుని గురించి నీవు చెబుతున్నది ఒకవేళ నిజమే అయితే, నీవు అతడి గురించి “గీబత్’ చేసావు, ఒకవేళ నిజం కాకపోతే నీవు అతడిపై అపనింద వేసావు” అన్నారు”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మత్తు కలిగించే ప్రతి పదార్థమూ మద్యమే అనబడుతుంది, కనుక మత్తు కలిగించే ప్రతిదీ హరామే (నిషేధించబడినదే). ఎవరైతే ప్రాపంచిక జీవితంలో మద్యము త్రాగుతూ ఉంటాడో, పశ్చాత్తాపము చెందకుండా, దానికి అలవాటు పడి ఉన్న స్థితిలోనే మరణిస్తాడో, అతడు పరలోక జీవితములో దానిని (స్వర్గపానీయాలను) త్రాగలేడు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అనుమానాలకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అనుమానం (మనం మాట్లాడే) మాటల్లోనే అత్యంత అసత్యమైనది, దుర్మార్గమైనది. మరియు మీరు ఒకరిని గురించి ఒకరు ఆరాలు తీయకండి; ఒకరిపైనొకరు గూఢచర్యం చేయకండి; ఒకరిపైనొకరు అసూయ చెందకండి; ఒకరినొకరు వదిలివేయకండి (సంబంధాలు తెంచుకోకండి); మరియు మీరు ఒకరినొకరు అసహ్యించుకోకండి. మరియు ఓ అల్లాహ్ దాసులారా సోదరులుగా ఉండండి.

హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు”.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”