- మద్యమును నిషేధించుటకు కారణం అది మత్తు కలిగించడమే. కనుక మత్తు కలిగించే ప్రతి పదార్థమూ, అది ఏ రకమైనదైనా, మత్తుపదార్థాల ఏ వర్గానికి చెందినది అయినా అది హరాం.
- మద్యములో ఉన్న పెద్ద హాని మరియు చెడు కారణంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దానిని నిషేధించాడు.
- పరలోకంలో మద్యం సేవించడం అనేది ఆనందము, సౌఖ్యము యొక్క పరిపూర్ణత మరియు సంతోషము, సుఖానుభవము యొక్క సంపూర్ణత ను సూచిస్తుంది.
- ఎవరైతే ఈ లోకంలో తనను తాను నియంత్రించుకొన కుండా, మద్యపానానికి దూరంగా ఉండడో, అతనికి అల్లాహ్ దానిని స్వర్గంలో తాగకుండా నిషేదిస్తాడు, కనుక ఒకరి ఆచరణకు అనుగుణంగానే దాని ప్రతిఫలం కూడా ఉంటుంది.
- ఇందులో, మరణానికి ముందు తన పాపముల నుండి పశ్చాత్తాప పడడానికి ముందడుగు వేయాలనే హితబోధ ఉన్నది.