- ఉద్దేశ్యపూర్వకముగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట అనే పాపానికి – పాపపరిహారం (కఫ్ఫారహ్) అనేది ఏదీ లేదు – ఎందుకంటే అది ఘోరమైన పాపము, నేరము మరియు అత్యంత ప్రమాదకరమైనది. అయితే దానికి పశ్చాత్తాపము ఉన్నది.
- ఈ హదీథులో ఘోరమైన పాపములలో (అల్ కబాయిర్ లలో) నాలుగింటిని మాత్రమే పేర్కొనడం అనేది, కేవలం అవి “ఘోరమైన పాపములలో (అల్ కబాయిర్ లలో) అత్యంత ఘోరమైనవి” అని తెలియజేయట కొరకే. అంతే కానీ ఘోరమైన పాపములను (ఈ నాలుగింటితోనే) పరిమితం చేయుటకు కాదు.
- పాపములు ‘ఘోరమైన పాపములు’ మరియు ‘చిన్న పాపములు’ అని రెండు విధాలుగా ఉన్నాయి: ఘోరమైన పాపములు అంటే: వాటికి ప్రపంచంలోనూ శిక్ష నిర్ధారించబడి ఉంది, ఉదాహరణకు మరణ శిక్ష, యావజ్జీవ కఠిన కారాగార శిక్ష మొదలైనవి. లేదా పరలోకములోనూ కఠిన శిక్షను గురించిన ప్రస్తావన చేయబడి ఉంది, ఉదాహరణకు నరకాగ్నిలో వేయబడుట. అలాగే ఘోరమైన పాపములలో కూడా శ్రేణులు ఉన్నాయి. కొన్ని అసహ్యకరమైనవి (నీచ స్థాయికి చెందినవి), మరికొన్ని నిషేధస్థాయికి చెందినవి. ‘చిన్న పాపములు’ అంటే పైన పేర్కొన్న ఘోరమైన పాపములు కాక మిగిలిన ఇతర పాపములు.