- లంచము ఇచ్చుట, లంచము పుచ్చుకొనుట, లంచము విషయములో మధ్యవర్తిత్వము చేయుట, లేక సహాయము చేయుట మొదలైనవన్నీ కూడా నిషేధము. కారణం – అది అసత్యానికి సహకరించిన దానికి సమానము.
- లంచము అనేది ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) ఒకటి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లంచము ఇచ్చు వానిని, లంచము పుచ్చుకొను వానిని – ఇద్దరినీ శపించినారు.
- న్యాయవ్యవస్థలో లంచము అనేది అతి పెద్ద నేరము, మరియు అత్యంత ఘోరమైన పాపము. కారణము, దానివల్ల అన్యాయము జరుగుతుంది, మరియు అల్లాహ్ అవతరింప జేసిన చట్టము ద్వారా కాక ఇతర విషయముల (అసత్యాల) ఆధారంగా తీర్పు ఉంటుంది.