- అవిశ్వాసులలో – ఒక ‘ముఆహద్’ ను, లేక ఒక ‘జిమ్మీ’ ని, లేక ఒక ‘ముస్త’మన్’ ను చంపుట నిషేధము. అది ఘోరమైన పాపములలో ఒకటి.
- ముఆహద్: ఎవరైతే ముస్లిములతో రక్షణ ఒప్పందంతో సహా ఏదైనా ఒప్పందములో ఉన్న అవిశ్వాసి; అతడు తన రాజ్యము/దేశములోని ఉంటాడు. యుద్ధములో అతడు ముస్లిములకు వ్యతిరేకముగా పోరాటం చేయడు, మరియు ముస్లిములు అతనితో పోరాటం చేయరు. అతడు ముస్లిముల రాజ్యములోనికి ప్రవేశించినా ఇదే సూత్రము వర్తిస్తుంది.
- జిమ్మీ: ముస్లిముల రాజ్యములో అధికారికముగా పన్ను చెల్లిస్తూ నివసిస్తున్న వ్యక్తి.
- ముస్త’మన్: ‘విశ్వాస పాత్రుడైన అవిశ్వాసి’; అతడు రక్షణతో సహా ఇంకేదైనా ఒప్పందముపై ముస్లిం రాజ్యములోని ఒక నియమిత కాలము కొరకు ప్రవేశించినట్లయితే, అటువంటి వానిని చంపుట నిషేధము.
- ఈ హదీసులో అవిశ్వాసులతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలని, వాటిని ఉల్లంఘించరాదనే హెచ్చరిక ఉన్నది.