ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసములో సంపూర్ణత కలిగిన విశ్వాసి ఎవరంటే, ఉత్తమ వ్యక్తిత్వము, శీల సంపద కలిగిన వాడు, చిరునవ్వుతో ప్రకాశవ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలోనికి ప్రవేశించడానికి ప్రబలమైన కారణాలు రెండు అని తెలియజేస్తున్నారు.
అవి, అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
నైతిక విలువలు మరియు సత్శీలతకు సంబంధించింత వరకూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరిలోనూ అత్యుత్తమములు, అత్యంత పరిపూర్ణత గలవారు. వ్యక్తిత్వము మరి...
సాద్ ఇబ్న్ హిషాం ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నించాను: “ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల...
విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజియల్లాహు అన్హా ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వమును గురించి చెప్పమని అడగడం...
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పా...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తనకు సంబంధించిన విషయాలలో, గౌరవప్రదమైన పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించడానికి ఇష్టపడేవారు మరియు ప్రాధాన్యతనిచ్చ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా” అన్నారు. మరియు 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా నరకంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నోటి కారణంగా మరియు జననేంద్రియాల కారణంగా” అని సమాధాన మిచ్చినారు”.
సాద్ ఇబ్న్ హిషాం ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నించాను: “ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."
షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి రెండు విషయాలను కంఠస్థం చేసుకున్నాను. వారు ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు. కనుక ఒకవేళ ఏదైనా ప్రాణిని చంపితే (చంప వలసి వస్తే), ఆ ప్రక్రియను యుక్తమైన విధంగా నిర్వహించండి, అలాగే ఏదైన ప్రాణిని అల్లాహ్ పేరున జిబహ్ చేస్తే (చేయవలసి వస్తే), ఆ ప్రక్రియను కూడా యుక్తమైన విధంగా నిర్వహించండి. మీలో ఒకరు (ఎవరు ఆ పనిని నిర్వహిస్తారో వారు) ఆ ప్రాణికి బాధ తెలియనంత పదునుగా ఉండేలా తన కత్తికి పదును పెట్టాలి”.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా, అల్లాహ్ వద్ద న్యాయవంతులు (గా గుర్తించబడిన వారు) , అపార కరుణామయుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుని కుడి చేతి వైపున కాంతితో చేయబడిన ఉన్నత ఆసనాలపై ఆశీనులై ఉంటారు. ఆయన రెండు చేతులు కూడా కుడి చేతులే. వారు (ఆ న్యాయవంతులు), తమ తీర్పులలో, తమ కుటుంబాల పట్ల మరియు తమ సంరక్షణలో ఉన్న వారి పట్ల న్యాయముతో వ్యవహరిస్తారు”.
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు”.
అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది. కస్తూరి సుగంధాన్ని అమ్మువాడు: అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు, లేదా నీవు అతడి నుండి కొద్ది సుగంధాన్ని కొనుక్కుంటావు, లేదా (అతని సాంగత్యములో గడిపిన కారణంగా) నీవు సుగంధాన్ని ఆస్వాదిస్తావు. లోహకారుని కొలిమి తిత్తులను ఊదువాడు: (కొలిమి నుండి నిప్పు రవ్వలు ఎగరడం వల్ల) అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా నీవు అతడి నుండి అప్రియమైన వాసన చూస్తావు”.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “నాకు ఏమైనా బోధించండి” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని పలికారు. అతడు పలుమార్లు అదే ప్రశ్నను అడిగాడు. ప్రతీ సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని సమాధానమిచ్చారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: "బలశాలి అంటే ఇతరులను చిత్తు చేసేవాడు కాదు. వాస్తవానికి బలశాలి అంటే ఎవరైతే కోపం కలిగినపుడు, తనను తాను అదుపులో ఉంచుకుంటాడో అతడు".
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”