- ఇందులో, పవిత్ర ఖుర్’ఆన్ బోధించే సభ్యత, సంస్కారాలు మరియు గుణగణాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శముగా తీసుకుని వారిని అనుసరించాలనే హితబోధ ఉన్నది.
- అలాగే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంస్కారాల, గుణగణాల ప్రశంస ఉన్నది – అది వహీ (దివ్యావతరణ) అనే ప్రమిద నుంచి వచ్చే కాంతి వంటిది.
- అన్ని ఉత్కృష్ఠ నైతిక విలువలకు మూలము పవిత్ర ఖుర్’ఆన్.
- ఇస్లాంలో నైతిక విలువలు మరియు నైతికత అంటే పూర్తి ఇస్లాం ధర్మము – అంటే ఇస్లాం ధర్మము యొక్క ఆదేశాలను పాటించుట మరియు ధర్మం నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండుట.