- ఇందులో – (ప్రజల మధ్య) న్యాయబధ్ధంగా, ధర్మబద్ధంగా తీర్పు చేయుట యొక్క ఘనత మరియు దానివైపునకు పిలుపు ఉన్నాయి.
- “న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీర్పు చేయుట” అనేది ఒక సాధారణత్వం కలిగిన వ్యక్తీకరణ. ఇందులో తన శాసనం క్రింద ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల పట్ల న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించుట, తన అధికారం క్రింద ఉన్న వారి పట్ల, చివరికి తన భార్యల పట్ల, తన సంతానం పట్ల న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించుట – మొదలైనవి అన్నీ వస్తాయి.
- ఇందులో - తీర్పు దినమునాడు, ఆ విధంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించే వారి స్థానము, వారి ఔన్నత్యము యొక్క చిత్రణ కనిపిస్తున్నది.
- తీర్పు దినము నాడు, విశ్వాసులకు వారి వారి ఆచరణల ఆధారంగా, వారికి ప్రసాదించబడే ఆవాసాలలో, వారికి ఇవ్వబడే స్థానాలలో వ్యత్యాసము ఉంటుందని తెలుస్తున్నది.
- ఏదైనా విషయం వైపునకు కార్యోన్ముఖులను చేయు విధానాలలో, తద్వారా వారు పొందబోయే అపూర్వ బహుమానాల ప్రస్తావన చేయడం అనేది, వారిని విధేయత వైపునకు ప్రోత్సహిస్తుంది.