- ఇందులో క్రోధానికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది. క్రోధం అన్ని రకాల చెడుల కలయిక అని, దాని నుండి దూరంగా ఉండడం అన్ని రకాల మేళ్ళ కలయిక అని తెలుస్తున్నది.
- అల్లాహ్ కొరకు క్రోధానికి గురి కావడం అంటే అల్లాహ్ నిషేధించిన విషయాల ఉల్లంఘన జరిగినపుడు క్రోధానికి గురి కావడం. అది కొనియాడ దగినదే.
- ఒకే విషయాన్ని పలుమార్లు పునరావృతంగా చెప్పడం అనేది, వినే వ్యక్తి ఆ విషయం యొక్క గాంభీర్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించే వరకు చేయడం కొన్ని సార్లు అవసరం అవుతుంది.
- ఇందులో, తనకు మేలు జరిగే ఏదైనా విషయాన్ని బోధించమని ఒక ఙ్ఞానవంతుని అభ్యర్థించడం యొక్క ఘనత కనిపిస్తుంది.