- కపటత్వాన్ని గురించి భయపెట్టడానికి మరియు వాటిలో పడకుండా హెచ్చరించడానికి కపటుని యొక్క కొన్ని సంకేతాలను ఈ హదీథు వివరిస్తుంది.
- ఈ హదీథు యొక్క లక్ష్యాలు: ఇందులో వివరించబడిన లక్షణాలు కపటత్వము యొక్క లక్షణాలు; ఈ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి, ఈ లక్షణాలలో కపటుడిని పోలి ఉంటాడు, అతను అవిశ్వాసాన్ని దాచిపెట్టి ఇస్లాంను చూపించే కపటుడు అని కాదు, వారి గుణగణాలను, వారి నైతికతను కలిగి ఉంటాడు. దీనిని గురించి ఇలా చెప్పబడింది: ఈ లక్షణాలు గాఢంగా కలిగి ఉండి, వాటి పట్ల అజాగ్రత్తగా ఉండి, వాటి విషయాన్ని తేలికగా తీసుకునే వ్యక్తికి ఇది ఆపాదించబడుతుంది. అటువంటి వ్యక్తి సాధారణంగా లోపభూయిష్టమైన విశ్వాన్ని కలిగి ఉంటాడు (నిఖార్సైన విశ్వాసాన్ని కలిగి ఉండడు).
- ఇమాం అల్ ఘజాలీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ధార్మికత యొక్క మూలము మూడు విషయాలపై ఉంటుంది. వాక్కు, ఆచరణ మరియు సంకల్పము. కనుక ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబద్ధం ద్వారా వాక్కులో చోటు చేసుకునే చెడును, ద్రోహం చేయడం ద్వారా ఆచరణలో చోటు చేకునునే చెడును మరియు వాగ్దానాన్ని ఉల్లంఘించడం ద్వారా ఉద్దేశ్యము, సంకల్పములలో చోటు చేసుకునే చెడును ఎత్తి చూపారు. ఎందుకంటే వాగ్దానాన్ని ఉల్లంఘించడం అనేది, వాగ్దానన్ని రద్దు చేయదు, వాగ్దానం చేయునపుడే దానిని నెరవేర్చే సంకల్పము లేకపోయినట్లైతే. అయితే వాగ్దానాన్ని నెరవేర్చే దృఢసంకల్పము కలిగి ఉన్నప్పటికీ, తరువాత ఏదో జరిగి, పరిస్థితుల కారణంగానో, లేక చేసిన వాగ్దానం కంటే మంచి వికల్పము తోచిన కారణంగానో దానిని నెరవేర్చలేకపోతే అతనిపై ‘కపటత్వము’ యొక్క ఆరోపణ కానీ, దోషము కానీ ఉండవు.
- కపటత్వం రెండు రకాలుగా ఉంటుంది: ధార్మికపరమైన కపటత్వము; ఇది తనను కలిగి ఉన్న వానిని ధర్మము (ఇస్లాం) నుండి బయటకు తీస్తుంది. ధార్మికపరమైన కపటత్వము అంటే బయటకు ఇస్లాంను కలిగి ఉన్నట్లు చూపుతూ, అవిశ్వాన్ని లోన దాచి పెట్టడం. ఇక రెండవది ఆచరణ పరమైన కపటత్వము; అంటే ఇది కపటులను వారి తీరుతెన్నులలో అనుకరించడం. ఇది తనను కలిగి ఉన్న వానిని ధర్మము (ఇస్లాం) నుండి బయటకు తీయదు. కానీ ఈ కపటత్వన్ని కలిగి ఉండడం ‘ఘోరమైన పాపము’ లలో (కబాయిర్ లలో) ఒకటిగా పరిగణించబడుతుంది.
- హాఫీజ్ ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైతే తన హృదయములో విశ్వాసము కలిగి ఉండి, మరియు అతడు తన నాలుకతో కూడా విశ్వాసవంతుడు అయినట్లైతే (మాటలలో కూడా విశ్వాసవంతుడే అయినట్లైతే), అతడు అవిశ్వాసి అని తీర్పు చేయబడదు, లేక అతడు శాశ్వతంగా నరకాగ్నిలో పడి ఉండే కపటుడుగా పరిగణించబడడు.
- ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఉలెమాల ఒక సమూహం ఇలా అన్నారు: ఈ హదీథులో పేర్కొనబడిన కపటులు అంటే అర్థము – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్న కపటులు. వారు తాము విశ్వాసము స్వీకరించినాము అని విశ్వాసులము అని తమ విశ్వాసమును గురించి మాట్లాడినారు, కానీ వారు అబద్ధమాడినారు; ధర్మములో వారికి విధులు, బాధ్యతలు ఇవ్వబడినాయి, కానీ వారు ధర్మాన్ని మోసం చేసినారు; ధర్మానికి సంబంధించిన విషయాలలో మరియు ధర్మానికి సహాయపడతామని వారు ప్రమాణం చేసినారు, కానీ వారు ప్రమాణ భంగం చేసినారు; విభేదాలలో, గొడవలు, తగవులలో వారు అత్యంత అనైతికంగా ప్రవర్తించినారు.