- ఇందులో తీవ్రమైన కోపానికి గురైనపుడు సహనం వహించడం, వివేకాన్ని, వివేచనను కోల్పోకుండా స్వీయ నియంత్రణ కలిగి ఉండడం యొక్క ఘనత తెలుస్తున్నది.
- తీవ్రమైన కోపములో ఉన్నపుడు తనకు వ్యతిరేకంగా తానే పోరాడుట అనేది శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుట కంటే కూడా ఘనమైన విషయం.
- ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలములో 'శక్తి' కి సంబంధించి ఉన్న భావనను ఇస్లాం ఒక ఉత్తమ నైతిక భావనలోనికి మార్చి వేసింది. కనుక ఇస్లాం ప్రకారం శక్తిశాలి అయిన వ్యక్తి అంటే తనను తాను అదుపులో ఉంచుకునేవాడు, తనపై నియంత్రణను కోల్పోని వాడు.
- కనుక 'కోపం' నుండి ముఖం త్రిప్పుకోవాలి, ఎందుకంటే కోపం ద్వారా వ్యక్తులకు, తద్వారా సమాజం మొత్తానికి కలిగించే నష్టం ఎక్కువ.