/ “నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”...

“నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”...

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

నైతిక విలువలు మరియు సత్శీలతకు సంబంధించింత వరకూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరిలోనూ అత్యుత్తమములు, అత్యంత పరిపూర్ణత గలవారు. వ్యక్తిత్వము మరియు మూర్తిత్వము పరంగా – ఉదాహరణకు కరుణపూరితమైన సంభాషణకు, మంచి పనులు చేయుటకు, దీప్తివంతమైన ముఖ వర్ఛస్సుకు మరియు ఎవరికైనా కీడు లేదా హాని తలపెట్టుటకు దూరంగా ఉండుట మరియు ఎవరైనా తనకు కీడు గానీ, హాని గానీ తలపెట్టితే దానిపై సహనం వహించుట మొదలైన గుణగణాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథములు.

Hadeeth benefits

  1. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వపు పరిపూర్ణత తెలుస్తున్నది.
  2. నైతిక విలువలకు, అత్యుత్తమ వ్యక్తిత్వానికి – మానవులందరూ అనుసరించవలసిన ఏకైక ఆదర్శమూర్తి (రోల్ మోడల్) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.
  3. అత్యుత్తమ శీలసంపద, వ్యక్తిత్వము మొదలైన వాటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించవలెననే హితబోధ ఇందులో ఉన్నది.