- చట్టప్రకారంగానైనా సరే, తలపెట్టబడిన దాని కంటే ఎక్కువ మోతాదులో ప్రతిచర్య చేయుట నిషేధించబడినది.
- అల్లాహ్ తన దాసులను, తమకు హాని కలిగించే ఏ పనినీ చేయమని ఆదేశించలేదు.
- ఎవరికైనా సరే హాని కలిగించడం మరియు దానికి ప్రతీకారం చేయడం నిషేధించబడినది – అది మాటల రూపంలో నైనా, చేతల రూపంలో నైనా లేక చేయ వలసిన పనిని చేయకుండా వదిలి వేయడం ద్వారా నైనా సరే.
- ‘ఎవరైతే హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు, మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు’ – అంటే దీని అర్థం, వారు చేసిన పనిని బట్టి దాని ప్రతిచర్య వివిధ రకాలుగా ఉంటుంది అని.
- షరియత్ యొక్క నియమాలలో ఒకటి: ‘షరియత్ (ఎవరికైనా, దేనికైనా) హాని కలిగించడాన్ని అనుమతించదు మరియు హానికి ప్రతిగా హాని తలపెట్టడాన్ని ఖండిస్తుంది.