అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటిక...
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఘోరమైన పాపములను గురించి ప్రశ్నించడం జరిగింది, దానికి ఆయన ఇలా అన్నారు: వాటిలో అన్నింటికన్నా ఘోరమైనది “అష్’...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్...
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు – ‘’అష్-షిర్క్’ కు (బహుదైవారాధనకు) సంబంధించి అల్లాహ్ ఇలా అంటున్నాడు; "తన సహాయకునిగా, సహ్యోగిగ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ యొక్క ప్రతి వ్యక్తి స్వర్గములోనికి ప్రవేశిస్తాడని, కేవలం ఎవరైతే దూరంగా ఉండిపోతాడో అతడు తప్ప అని తె...
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్...
ఈ హదీసులో: క్రైస్తవులు ఈసా ఇబ్నె మరియం అలైహిస్సలాం విషయంలో ఏ విధంగానైతే మితిమీరినారో, ఆ విధంగా – షరియత్ విధించిన పరిమితులు అతిక్రమించి, అల్లాహ్ కు మాత...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో – ఒక ముస్లిం – తన తల్లిపై తనకు గల ప్రేమ కంటే, తన తండ్రిపై తనకు గల ప్రేమ కంటే, తన కుమారులపై, తన కుమార్తెలపై త...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా ఉమ్మత్ (ముస్లిం సమాజం) లోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోనికి ప్రవేశిస్తారు, ఎవరైతే నిరాకరిస్తారో వారు తప్ప”. (అది విని) వారితో ఇలా అనడం జరిగింది “ఓ రసూలుల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు?” దానికి వారు “ఎవరైతే నాకు విధేయత చూపుతారో (నన్ను అనుసరిస్తాడో) అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతాడో (నన్ను అనుసరించడో) నిశ్చయంగా అతడు నిరాకరించిన వాడు”.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం చేసింది చాలా ప్రశ్నలు అడగడమే మరియు తమ ప్రవక్తలతో విభేదించడమే. కాబట్టి, నేను మిమ్మల్ని దేనినుంచైనా నిషేధించినట్లయితే, దాని నుండి దూరంగా ఉండండి; మరియు నేను మీకు ఏదైనా చేయమని ఆజ్ఞాపిస్తే, మీ శక్తి మేరకు చేయగలిగినంత చేయండి.”
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే".
మిఖ్'దాం బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.
ఆయిషా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ ఉల్లేఖనం : అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆయన అంతిమ ఘడియలు అవతరిస్తున్న సమయం. అపుడు ఆయన (తాను కప్పుకుని ఉన్న) దుప్పటిని తన ముఖము పైకి లాక్కుని, అసౌకర్యముగా అనిపించిన వెంటనే ముఖముపై నుండి తీసివేయసాగినారు. ఆయన ఆ స్థితిలో ఉండి (కూడా) ఇలా అన్నారు “క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నారు”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన పని గురించి హెచ్చరించారు.”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”.
ఉమ్ముల్ ము'మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”