- ఇందులో – ప్రవక్తల సమాధులను మరియు ధర్మగురువుల (ఔలియాల) సమాధులను అల్లాహ్ ను ఆరాధించే మస్జిదులుగా చేసుకొనుటను నిరోధించడం స్పష్టమవుతున్నది. ఎందుకంటే అది అల్లాహ్ తో షిర్క్ చేయుటకు (ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టుటకు) దారి తీస్తుంది.
- ఇందులో – అల్లాహ్ యొక్క తౌహీద్ (అల్లాహ్ యొక్క ఏకత్వము) పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తీవ్రమైన శ్రద్ధ మరియు తాపత్రయం, మరియు సమాధుల ప్రట్ల (ప్రజలలో) పూజ్య భావం పెరుగుతుందేమో అనే ఆయన భయం కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది బహుదైవారాధనకు (షిర్క్ నకు) దారి తీస్తుంది.
- ఇందులో – సమాధులపై కట్టడాలు నిర్మించి వాటిని మస్జిదులుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నందుకు యూదులు మరియు క్రైస్తవులను, ఇంకా వారిలాగానే సమాధులపై కట్టడాలు నిర్మించి ఆరాధనా గృహాలుగా చేసుకునే ఇతరులను శపించుట అనుమతించబడిన విషయమే అని తెలియుచున్నది.
- సమాధులపై కట్టడాలు నిర్మించడం అనేది యూదులు మరియు క్రైస్తవుల విధానాలలో ఒకటి. మరియు ఈ హదీథులో వారిని అనుకరించడం పట్ల నిషేధం ఉన్నది.
- సమాధులను మస్జిదులుగా చేసుకోవడం అంటే, సమాధులవద్ద నమాజు ఆచరించుట లేదా వాటి వైపునకు తిరిగి నమాజు ఆచరించుట – (నిజానికి) అక్కడ మస్జిదు నిర్మించబడి లేకపోయినా.