- ఏ విధంగానైతే సత్కార్యాలు భిన్నమైన స్థాయిలు కలిగి ఉంటాయో, పాపకార్యాలు కూడా తీవ్రతలో హెచ్చుతగ్గులు కలిగి ఉంటాయి.
- ఘోరమైన పాపములు: అల్లాహ్ కు సాటి కల్పించుట, నీతో పాటు (నీ ఉపాధి నుండి) తింటాదు అనే ఉద్దేశ్యముతో నీ సంతానాన్ని నీవే చంపుట; మరియు పొరుగువాని భార్యతో వ్యభిచరించుట.
- నిశ్చయంగా, జీవనోపాధి అంతా అల్లాహ్ చేతిలోనే ఉంది. సర్వలోకాలకు జీవనోపాధిని ప్రసాదించేవాడు పరమ పవితుడైన ఆయనే (అల్లాహ్’యే).
- (ఇస్లాం లో) పొరుగు వాని హక్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అతనికి ఏ విధంగానైనా హాని, నష్టం కలిగించడం, ఇతరులకు హాని, నష్టం కలిగించిన దాని కంటే చాలా తీవ్రమైనది.
- సృష్టికర్తయైన అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు; ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు.