- ఇందులో ఖుర్’ఆన్ ను ఏ విధంగానైతే గౌరవిస్తామో మరియు స్వీకరిస్తామో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్’లను కూడా గౌరవించాలి, స్వీకరించాలి అనే ఉద్బోధ ఉన్నది.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం, అల్లాహ్’కు విధేయత చూపడమవుతుంది, అలాగే ఆయను అవిధేయత చూపడం అల్లాహ్’కు అవిధేయత చూపడమవుతుంది.
- ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ యొక్క ప్రామాణికతకు సంబంధించి ఒక నిదర్శనం. మరియు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్’లను, వారి హదీసులను తోసిపుచ్చుతారో మరియు నిరాకరిస్తారో వారికి ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది.
- ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ను నిరాకరిస్తారో వారు ‘మురిజున్’ (సందేశాన్ని తిరస్కరించినవారు) గా పరిగణించబడతారు. మరియు ‘మేము ఖుర్’ఆన్ ను అనుసరిస్తున్నాము’ అని వారు చేసే దావా ఒట్టి అబద్ధం.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్తత్వానికి ఈ హదీసు ఒక నిదర్శనం. ఇందులో ఆయన భవిశ్యత్తులో జరుగబోయే దానిని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఈనాడు జరుగుతున్నది కూడా.