- ఇందులో బహుదైవారాధన, అది ఏ రూపంలో ఉన్నా సరే, దానికి వ్యతిరేకంగా ఒక హెచ్చరిక ఉన్నది. ఆచరణలు అల్లాహ్ వద్ద స్వీకరించబడడానికి అది ఒక పెద్ద ఆటంకంగా మారుతుందని అర్థమవుతున్నది.
- అల్లాహ్ అత్యంత ఘనమైన వాడు మరియు అత్యంత స్వయం సమృధ్ధుడు అనే చైతన్యం ఎల్లవేళలా కలిగి ఉండ వలెను. అది విధేయతకు సంబంధించిన ఆచరణలు కేవలం ఆయన కొరకే అయి ఉండాలనే ఆలోచనకు బలాన్ని, స్థిరత్వాన్ని చేకూరుస్తుంది.