- ఇళ్ళు స్మశానాలుగా మారకుండా నిషేధించడం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధనలో ఒక భాగం.
- ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించడానికి (మాటిమాటికి) ప్రయాణించడంపై నిషేధం కనిపిస్తున్నది. దానికి బదులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించమని ఆదేశించబడుతున్నది, మరియు ఆ దరూద్ వారిని చేరుతుందని తెలియ జేయ బడుతున్నది. తద్వారా అతడి ప్రయాణం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదు కొరకు మరియు అందులో సలాహ్ ఆచరించుట కొరకు మాత్రమే కావవలెను.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని, అలాగే మరింకే సమాధినైనా, ఒక ప్రత్యేక సమయంలోనో లేక ఒక ప్రత్యేక పధ్ధతినో అనుసరించి మాటిమాటికీ దర్శించడం అనేది అక్కడ ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
- మీరు ఎక్కడ ఉన్నా, ఏ సమయం లోనైనా, షరియత్’ను అనుసరించి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించడంలోనే అల్లాహ్ వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఘనత ఉన్నది.
- ఏ విధంగా నైతే సమాధుల వద్ద నమాజు ఆచరించుట సహాబాల కొరకు నిషేధించబడినదో, అదే విధంగా, ఏ నమాజూ చదవబడని స్మశానాల మాదిరిగా ఇళ్ళు మారడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు.