/ “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుక...

“నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుక...

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే".
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

దివ్య ఖుర్’ఆన్ నుంచైనా లేదా సున్నతుల నుంచి అయినా సరే (నేర్చుకున్న) ఙ్ఞానాన్ని ఇతరులకు చేర వేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు, అది కొద్దిపాటి ఙ్ఞానమైనా సరే, అంటే దివ్య ఖుర్’ఆన్ నుండి ఒక వాక్యమైనా లేక ఒక హదీసు అయినా సరే. అయితే నియమము ఏమిటంటే అతడు ఏమి చేరవేస్తున్నాడో లేదా దేని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తున్నాడో, దాని గురించి అతడు స్వయంగా పూర్తి ఙ్ఞానమూ, అవగాహనా కలిగి ఉండాలి. తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రాయీలు సంతతి వారినుంచి కూడా ఉల్లేఖించవచ్చని, అందులో అభ్యంతరము ఏమీ లేదని వివరించినారు. అంటే దాని అర్థము, వారికి ఏమి జరిగినది అనే విషయాలను గురించి. అయితే అవి (ఆ ఉల్లేఖనలు) మన షరియత్’కు వ్యతిరేకమైనవి కాకూడదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనపై అబద్దాలాడుట గురించి హెచ్చరించినారు మరియు ఎవరైతే తనపై ఉద్దేశ్యపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో స్థిరపరుచుకున్నట్లే అని తెలిపినారు.

Hadeeth benefits

  1. ఇందులో అల్లాహ్ యొక్క షరియత్ ను ఇతరులకు చేరవేయుటను గురించి ప్రోత్సాహం ఉన్నది. అయితే మనిషిపై, అతడు ఏమి కంఠస్థం చేసి ఉన్నాడో, దానిని ఇతరుల ముందుకు తీసుకు రావలసి ఉంటుంది, అది కొద్దిగైనా సరే.
  2. ఇందులో, అల్లాహ్ ను సరియైన విధానం’లో ఆరాధించుటకు గాను మరియు ఆయన షరియత్ ను ఖచ్చితంగా (ఎటువంటి తప్పులూ లేకుండా) ఇతరులకు చేరవేయుటకు గాను షరియత్ యొక్క ఙ్ఞానము సంపాదించుట యొక్క ఆవశ్యకత తెలియుచున్నది.
  3. ఈ విషయానికి సంబంధించిన అతి తీవ్రమైన హెచ్చరిక పరిధిలోనికి రాకుండా ఉండుటకు గాను, ఏదైనా హదీథును ఇతరులకు చేరవేసే ముందు లేదా ప్రచురించుటకు ముందు, దాని ప్రామాణికతను అన్ని విధాలా సరి చూసుకొనుట ప్రతివారిపై తప్పనిసరి విధి అని తెలియుచున్నది.
  4. అసత్యం’లో పడకుండా ఉండుటకు, మన సంభాషణలలో నిజాయితీ, హదీసుల విషయం’లో, ప్రత్యేకించి సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ యొక్క షరియత్ విషయంలో జాగ్రత్త వహించాలని ఇందులో హితబోధ ఉన్నది.