హాకిం ఇబ్న్ హిజాం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి ఇస్లాం స్వీకరించి విశ్వాసిగా మారితే, అతడు అవిశ్వాసిగా గడిపిన...
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల పట్ల అల్లాహ్ యొక్క అపారమైన దయ, కరుణ, అనుగ్రహం, మరియు అవిశ్వాసుల పట్ల ఆయన యొక్క న్యాయము ను గురించి...
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్...
సకల శుభాల యజమాని, సర్వోన్నతుడు అయిన అల్లాహ్, హదీథ్ అల్ ఖుద్సీ లో ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు: ‘ఓ ఆదం కుమారుడా!...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సర్వ శక్తిమంతుడు, మహోన్నతుడు అయిన తన ప్రభువు ఇలా ప్రవచించినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు: “నా...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఇలా ఉల్లేఖించినారు – ఒకవేళ అల్లాహ్ యొక్క దాసుడు ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, ఆ తరువాత అల్లాహ...
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఎటువంటి వ్యక్తినంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఏదైనా హదీథు వింటే దాని ద్వారా అల్లాహ్...
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్ యొక్క) దాసులలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేక ఆమె తనను తాను పర...

హాకిం ఇబ్న్ హిజాం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అఙ్ఞానపు కాలములో (ఇస్లాం స్వీకరించక ముందు కాలములో) పేదవారికి దానము చేయుట, బానిసలకు విముక్తి కలిగించుట, బంధువులను ఆదరించుట, వారితో బంధుత్వాలను కొనసాగించుట మొదలైన మంచిపనులు చేస్తూ ఉండేవాడిని. మరి నాకు ఆ మంచిపనుల ప్రతిఫలం లభిస్తుందా?” దానికి ఆయన “నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు.

అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మరియు అవిశ్వాసి విషయంలో, అతడు అల్లాహ్ కొరకు మాత్రమే చేసిన మంచి పనులకు, అల్లాహ్ అతనికి ఈ ప్రాపంచిక జీవితములోనే ప్రసాదిస్తాడు. అతడు పరలోకము చేరుకున్నపుడు అతనికి ప్రతిఫలం ప్రసాదించడానికి ఒక్క సత్కార్యమూ ఉండదు".

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీ పాపాలు ఆకాశపు మేఘాలను చేరేటంత ఎక్కువగా ఉన్నా, అపుడు నీవు నన్ను క్షమించమని వేడుకుంటే, నేను నిన్ను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీవు భూమి అంత పెద్ద పెద్ద పాపాలతో నావద్దకు వచ్చినా, నాకు సమానంగా ఎవరినీ భాగస్వామిగా చేయకుండా నన్ను కలుసుకుంటే నేను అంతకంటే గొప్ప క్షమాపణతో నీ వద్దకు వస్తాను.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సర్వ శక్తిమంతుడు, మహోన్నతుడు అయిన తన ప్రభువు ఇలా ప్రవచించినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు: “నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు.” అపుడు పరమ పవితృడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. తరువాత అతడు మళ్ళీ పాపపు పని చేసాడు. అతడు మళ్ళీ ఇలా వేడుకున్నాడు “ఓ నా ప్రభూ! నా ఈ పాపాన్ని క్షమించు”. అపుడు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని, మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. నేను నా దాసుణ్ణి క్షమించాను. అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి”.

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఎటువంటి వ్యక్తినంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఏదైనా హదీథు వింటే దాని ద్వారా అల్లాహ్ నాకు ఎంత మేలు చేకూర్చ దలిస్తే అంత మేలు చేకూర్చేవాడు (అంత మంచిగా నేను ఆ హదీసును ఆచరించేవాడిని). ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఎవరైనా నాకు హదీథు వినిపిస్తే అతణ్ణి ప్రమాణం చేసి చెప్పమని అడిగే వాడిని. అతడు ప్రమాణం చేస్తే నేను (అతడు చెప్పినది సత్యమని) అతడిని విశ్వసించే వాడిని. అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఒకసారి ఒక హదీసును ఉల్లేఖించినారు. ఆయన సత్యము పలికినారు. ఆయన ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు”, తరువాత ఆయన (అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతును పఠించినారు: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135] {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుద్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలి ఇమ్రాన్: 3:135]

అబూ మూసా ఇబ్న్ ఖైస్ అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: : “నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి ఇలా అంటాడు: “ఎవరైనా ఉన్నారా నాకు మొరపెట్టుకునేవాడు (నాకు దుఆ చేసేవాడు) నేను అతని దుఆ కు స్పందిస్తాను; ఎవరైనా ఉన్నారా నన్ను ఏదైనా కోరుకునేవాడు, నేను అతనికి ప్రసాదిస్తాను; ఎవరైనా ఉన్నారా నా క్షమాభిక్ష కొరకు ప్రార్థించే వాడు, నేను అతడిని క్షమిస్తాను”.

ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం – “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను”; తాను చెవులారా విన్నట్లుగా, ను’మాన్ ఇబ్న్ బషీర్ తన చేతుల (చూపుడు) వేళ్ళను తన చెవులకు దగ్గరగా తీసుకుని వెళ్ళి చూపించినారు: “నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.

అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా సహాబాలను అవమానించకండి (వారి పట్ల అవమానకరంగా మాట్లాడకండి), మీలో ఎవరైనా ఉహుద్ కొండంత బంగారాన్ని ఖర్చు చేసినా, అది వారిలో (సహాబాలలో) ఒకరు ఖర్చు చేసిన ‘ముద్’ లేక కనీసం ‘ముద్’లో సగం అంత దానికి కూడా సమానం కాదు.”

"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "ఒకరోజు సవారీపై నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉన్నాను. అపుడు వారు నాతో ఇలా పలికారు "ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో. గుర్తుంచుకో, ఒకవేళ ఈ ఉమ్మత్ (ముస్లిం జాతి మొత్తం), నీకు ఏమైనా ప్రయోజనం కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమీ ప్రయోజనం కలుగజేయలేరు, అల్లాహ్ నీకోరకు ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. అలాగే, ఒకవేళ ఈ ఉమ్మత్ (సమాజం మొత్తం), నీకు ఏమైనా హాని (నష్టము) కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమాత్రమూ హాని (నష్టము) కలుగజేయలేరు, అల్లాహ్ నీకు వ్యతిరేకంగా ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. కలములన్నీ లేపి వేయబడినాయి, కాగితములన్నీ ఇంకిపోయాయి (ఎండిపోయినాయి). (అంటే, అల్లాహ్ ముందుగానే ప్రతి విషయాన్ని పూర్వ నిర్దేశము గావించి ఉంచినాడని, ఇక దానికి జోడించడానికి లేదా అందునుండి ఏమైనా తీసివేయడానికి ఏమాత్రమూ వీలు లేదు అని అర్థము).

సుఫ్యాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అస్సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”

ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”