- ఈ హదీసులో - (మన వల్ల) ఏదైనా పాపపు పని జరిగిపోతే, వెంటనే నమాజు ఆచరించి అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరాలనే ప్రోత్సాహము ఉన్నది.
- అలాగే ఇందులో సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ యొక్క అపారమూ, అనంతమూ అయిన క్షమాగుణము, ఆయన తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించుట మరియు వారిని క్షమించుట గురించి తెలియుచున్నది.