- పశ్చాత్తాప స్వీకరణ దాని ద్వారము తెరుచుకుని ఉన్నంత వరకూ జరుగుతూనే ఉంటుంది; మరియు చావు గురక అతని కంఠాన్ని చేరేంతవరకు, అంటే అతని ఆత్మ అతని కంఠాన్ని చేరేంత వరకు జరుగుతుంది. ఆ ద్వారము, సూర్యుడు పడమటి నుండి ఉదయించినపుడు మూసుకుపోతుంది.
- పాపం కారణంగా నిరాశ పడకండి మరియు నిస్పృహ చెందకండి, అల్లాహ్ యొక్క క్షమాపణ మరియు కరుణ చాలా విస్తృతమైనది మరియు పశ్చాత్తాపం యొక్క తలుపు తెరుచుకునే ఉంది.
- పశ్చాత్తాపము యొక్క నిబంధనలు: మొదటిది: ఆ పాపాన్ని వదిలి వేయుట; రెండవది: ఆ పాపపు పనికి పాల్బడినందుకు మనస్ఫూర్తిగా సిగ్గుపడుట, విచారించుట; మూడవది: మరలా ఎన్నటికీ ఆ పనికి పాల్బడనని స్థిరంగా నిర్ణయించుకొనుట. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ హక్కులకు సంబంధించిన వాటికి పశ్చాత్తాపపడే విధానం. ఒకవేళ జరిగిన తప్పు లేక పాపము అల్లాహ్ యొక్క దాసుల హక్కుకు సంబంధించినది అయితే, అందుకు గానూ పశ్చాత్తాపం చెల్లుబాటు కావాలంటే, అల్లాహ్ వద్ద స్వీకరించబడాలంటే ఆ హక్కును దాని యజమానికి చేర్చాలి, లేదా ఆ హక్కు నెరవేర్చబడాలి. లేదా ఆ యజమాని దానిని క్షమించాలి.