- ధర్మము (ఇస్లాం) యొక్క మూలము అల్లాహ్ ను విశ్వసించుట, ఆయన యొక్క “రుబూబియత్”ను (కేవలం ఆయన మాత్రమే ప్రభువు అని) విశ్వసించుట, ఆయన యొక్క “ఉలూహియత్”ను (కేవలం ఆయన మాత్రమే అన్ని రకాల ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు అని) విశ్వసించుట మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన దివ్య నామములను మరియు ఆయన గుణ, విశేషాలను విశ్వసించుట – వీటిపై ఆధారపడి ఉంది.
- విశ్వసించిన తరువాత దానిపై స్థిరంగా ఉండుట, ఆయనను మాత్రమే ఆరాధించుటలో స్థిరంగా కొనసాగుట – ఇవి అత్యంత ముఖ్యమైనవి.
- అచంచలమైన విశ్వాసము - ఆచరణలు ఆమోదయోగ్యం కావడానికి ఒక షరతు.
- అల్లాహ్ పై విశ్వాసము అనేది విశ్వాసం యొక్క మూల సిద్ధాంతాలలో వివరించిన వాటిని, మూల సూత్రాల పరంగా విశ్వసించడం; ఆ విశ్వాసం మన హృదయంలో అచంచలంగా ఉండాలి, మరియు దానికి కట్టుబడి ఉండడం, దాని పట్ల విధేయత అనేవి మన ఆచరణలలో – అవి బాహ్య ఆచరణలు కానీ, లేక అంతరంగ ఆచరణలు కానీ – వాటిలో ప్రస్ఫుటం కావాలి.
- విశ్వాసము పై స్థిరత్వము అంటే – విధిగా ఆచరించవలసిన వాటిని తప్పనిసరిగా ఆచరించడం, నిషేధించిన వాటిని వదిలివేయడం ద్వారా - (ఇస్లాం చూపిన) మార్గానికి కట్టుబడి ఉండడం