విశ్వాసుల మాత (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్’ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయునపు...
జనాబత్ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయాలని సంకల్పించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా రెండు చేతులను కడుక్కోవడంతో ప్రారంభించేవారు. తరువాత...
అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో పని మీద నన్ను మరొక ప్రదేశానికి పంపినారు. అక్కడ నేను “జనాబత్”...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ను తనకు సంబంధించిన కొన్ని పనుల నిమిత్తం ఒక ప్రయాణంపై పంపినారు. అక్కడ ఆయన సంభోగముల...
అల్ ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రయాణంలో ఉన్నారు. అపుడు వారు వుజూ చేసినారు. వుజూలో కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి, వారు పాదాలకు తొడుగుకుని ఉన్న...
ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“ఫాతిమా బింత్ అబీ హుబైష్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “(ఓ ప్రవక్తా!) బహి...
ఫాతిమా బింత్ హుబైష్ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “బహిష్ఠు కారణంగా, బహిష్ఠు దినములు పూర్తి అయిన తరువాత కూడా నా...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుద...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి కడుపులో అసౌకర్యంగా ఉండి, ఒకవేళ కడుపు నుండి గాలి లాంటిది ఏదైనా బయటకు వెల...
విశ్వాసుల మాత (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్’ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయునపుడు ముందుగా తన రెండు చేతులను కడుక్కునేవారు, తరువాత సలాహ్ కొరకు (నమాజు కొరకు) చేయు విధంగా వుదూ చేసేవారు, తరువాత సంపూర్ణంగా స్నానం చేసేవారు. వారు తన చేతి వేళ్ళను తల వెంట్రుకల లోనికి జొప్పించి (వెంట్రుకల క్రింది) చర్మమంతా తడిసినది అని సంతృప్తి చెందే దాకా తడి చేసేవారు, తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేసేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరమూ ఒకే నీటి తొట్టి నుండి, ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”
అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో పని మీద నన్ను మరొక ప్రదేశానికి పంపినారు. అక్కడ నేను “జనాబత్” స్థితికి (గుసుల్ తప్పనిసరిగా ఆచరించవలసిన స్థితికి) లోనయ్యాను. అక్కడ నీళ్ళు దొరకలేదు. దానితో నేను మట్టిలో జంతువు పొర్లిన విధంగా పొర్లాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పాను. అపుడు ఆయన ఇలా అన్నారు: “నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ చేతితో కుడి చేతి వెనుక భాగాన్ని, అలాగే కుడి చేతితో ఎడమ చేతి వెనుక భాగాన్ని, తరువాత ముఖాన్ని మసాహ్ చేసినారు.
అల్ ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“ఫాతిమా బింత్ అబీ హుబైష్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “(ఓ ప్రవక్తా!) బహిష్ఠు కారణంగా (బహిష్ఠు దినములు గడిచిపోయిన తరువాత కూడా) నాకు నిరంతరం రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగా నేను పరిశుద్ధత పొందలేకపోతున్నాను. నేను సలాహ్ కు (నమాజుకు) దూరంగా ఉండాలా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు “లేదు (నీవు సలాహ్ కు దూరంగా ఉండవలసిన అవసరం లేదు); అది ఒక రక్తనాళము. సాధారణంగా బహిష్ఠు ఎన్ని దినముల కొరకు ఉంటుందో అన్ని దినములు సలాహ్ కు దూరంగా ఉండు. ఆ తరువాత గుసుల్ చేసి నమాజులను ఆచరించు.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా పలికినారు: “ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.”
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”
అబ్దుల్లాహ్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి) ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”
సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నన్ను మస్జిదుకు తీసుకుని వచ్చేవారు ఎవరూ లేరు” అని, తన ఇంటిలోనే నమాజు ఆచరించుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని వెనుకకు పిలిచి “నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని ఉల్లేఖించారు: “ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?” దానికి వారు ఇలా అన్నారు: “ఎలాంటి మలినమూ కూడా మిగిలి ఉండదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరి ఐదు సలాహ్’ల (నమాజుల) ఉదాహరణ కూడా ఇటువంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు.”