/ “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అ...

“ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అ...

సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే ఇలా పలుకుతాడో: “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని): అంటే దాని అర్థము: అర్థం: “అల్లాహ్ తప్ప సకల ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేడని, మరియు ఆయన తప్ప అరాధించబడే ప్రతిదీ అబద్ధమని నేను ధృవీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను మరియు (ప్రపంచానికి) తెలియజేస్తున్నాను” అని. “వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను): అంటే దాని అర్థము ఆయన అల్లాహ్ యొక్క దాసుడు, కనుక ఆయన ఆరాధించబడడు (ఆయనను ఆరాధించరాదు); మరియు ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు, ఆయన అసత్యం పలుకడు. “రజీతు బిల్లాహి రబ్బన్”: (నేను అల్లాను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను, అల్లాహ్ నా ప్రభువుగా సంతోషిస్తున్నాను): అంటే దాని అర్థము: నేను ఆయన ప్రభుతను, ఆయన దైవత్వాన్ని, ఆయన నామములు మరియు గుణలక్షణాలతో సంతృప్తి చెందాను మరియు సంతోషిస్తున్నాను. “వ బి ముహమ్మదిన్ రసూలన్”: (నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క సందేశహరునిగా సంతోషిస్తున్నాను, అంగీకరిస్తున్నాను): అంటే దాని అర్థము: అల్లాహ్ ద్వారా ఆయనకు పంపబడిన ప్రతిదానితో మరియు ఆయన మాకు అందించిన ప్రతిదానితో నేను సంతృప్తి చెందాను మరియు సంతోషిస్తున్నాను. “వ బిల్ ఇస్లాం...”: (మరియు ఇస్లాంను ...) అంటే దాని అర్థము: ఇస్లాం యొక్క అన్ని నిబంధనల ప్రకారం, ఆదేశాలు మరియు నిషేధాలతో సహా “దీనన్...”: (ధర్మంగా...) అంటే దాని అర్థము: “ఇస్లాం ను నా ధర్మంగా విశ్వసిస్తున్నాను, మరియు విధేయుడను అవుతున్నాను”. “అతని పాపాలు క్షమించివేయబడతాయి” – అంటే దాని అర్థము అతని వల్ల జరిగిన చిన్న పాపాలు (సగాయిర్ పాపలు) క్షమించి వేయబడతాయి అని.

Hadeeth benefits

  1. అజాన్ విన్నపుడు ఈ విధంగా దుఆ చేయడం అనేది చిన్న పాపలకు పరిహారం అవుతుంది.