- బహిష్ఠు యొక్క సాధారణ కాలపరిమితి ముగిసిన వెంటనే స్త్రీ గుసుల్ ఆచరించి పరిశుద్ధత పొందుట విధి.
- ఇస్తిహాజా రక్తస్రావము జరుగుతున్న స్త్రీ కూడా నమాజు ఆచరించుట విధి.
- బహిష్ఠు (ఋతుస్రావము): కొన్ని నిర్ణీత దినముల కొరకు, గర్భాశయము సహజసిద్ధంగా యోని మార్గము ద్వార విడుదల చేసే రక్తము. ఆ స్థితిని ‘బహిష్ఠు’ లేదా ‘ఋతుస్రావము’ అంటారు.
- అల్-ఇస్తిహాదహ్: ఇది బహిష్ఠు దినముల తరువాత మిగతా దినములలో గర్భాశయము అడుగు భాగమునుండి స్రవించే రక్తము.
- బహిష్ఠు రక్తమునకు మరియు ఇస్తిహాజహ్ రక్తమునకు మధ్య భేదము: బహిష్ఠు రక్తము ఎక్కువగా నలుపు రంగులో ఉండి, ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది మరియు దుర్వాసన కలిగి ఉంటుంది. ఇస్తిహాజహ్ రక్తము పలుచగా ఉంటుంది మరియు దుర్వాసన ఉండదు.