అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
కొన్నిసార్లు ఉదూ చేయునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో కడగవలసిన శరీర భాగాలను రెండేసి మార్లు కడిగేవారు – అంటే ముఖాన్ని, నోటిని పుక్కిలించడం,...
హుమ్రాన్ మౌలా (ఈయన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు యొక్క బానిసలలో ఒకరు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయనకు స్వేచ్ఛ ప్రసాదించి, బానిసత్వము నుండి విముక్తి...
ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆచరణాత్మకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని బోధించినారు. బాగా స్పష్టంగా ఉండేందుకు గాను, ఆయన ఒక పాత్రలో...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి న...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత పొందు విషయానికి సంబంధించి కొన్ని నియమాలను వివరించారు. మొదటిది: ఎవరైనా వుజూ చేసినపుడు అతడు తన శ్వాస...
ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన (అక్కడ ఆగి) ఇలా అన...
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. అపుడు వారు ఇలా అన్నారు: “ఈ సమాధులలో ఉన్నవారు నిశ్చయంగా శిక్షించబడు చ...
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధ...
మూత్ర విసర్జన కొరకు గానీ, లేక మల విసర్జన కొరకు గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైన నియమిత ప్రదేశములో (మరుగుదొడ్డి, లేక బహిర్భూమిలో) ప్రవేశించడాన...
అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
హుమ్రాన్ మౌలా (ఈయన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు యొక్క బానిసలలో ఒకరు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయనకు స్వేచ్ఛ ప్రసాదించి, బానిసత్వము నుండి విముక్తి చేసినారు) ఉల్లేఖన: అతను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించగా చూసినారు. అపుడు ఆయన (ఉస్మాన్ రజియల్లాహు అన్హు) (ఆ నీటి పాత్ర నుండి) తన రెండు చేతులపై నీళ్ళను వొంపుకుని మూడు సార్లు బాగా కడిగినారు. తరువాత నీటిలో తన కుడి చేతిని వేసి, గుప్పెడు నీళ్ళతో తన నోటినీ మరియు ముక్కునూ శుభ్రపర్చుకున్నారు. తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడుగుకున్నారు, తన చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడిగినారు. తరువాత (తడి అరచేతులతో) తన తలను తుడిచినారు. తరువాత తన పాదాలను (చీలమండలాల వరకు) మూడు సార్లు కడిగినారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “ఇపుడు నేను ఏవిధంగా ఉదూ చేసినానో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా నేను చూసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని తెలిపినారు “ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.
ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన (అక్కడ ఆగి) ఇలా అన్నారు: “వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెట్టు నుండి ఒక తాజా రెమ్మను తీసుకుని, దానిని రెండు భాగాలుగా చీల్చి, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సమాధిపై ఉంచినారు. ఆయనతో ఉన్నవారు ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అలా ఎందుకు చేసినారు?” దానికి ఆయన “ఆ రెమ్మలు పచ్చగా (ఎండిపోకుండా) ఉన్నంత వరకు బహుశా వారి శిక్ష తగ్గించబడవచ్చు.”
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను).
హుదైఫా (రదియల్లాహు అన్హు) కధనం : “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రతి ఏడు దినములలో (కనీసం) ఒక దినమున (వారానికొకసారి) తల మరియు శరీరమును (శుభ్రముగా) కడుగుతూ (తల) స్నానము చేయుట ప్రతి ముస్లిము పై విధి.”
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి”. సహీహ్ బుఖారీలో ఇలా ఉంది “అతడు వుదూకు ముందు తన పురుషాంగాన్ని కడుక్కుని వుదూ చేయాలి”.