- రాత్రి నిద్రించిన తర్వాత, నిద్ర నుండి లేచినట్లయితే మిస్‌వాక్‌ని ఉపయోగించడం షరియత్ లోని భాగమే అని ఈ హదీథు ద్వారా నిర్ధారణ అవుతున్నది. ఎందుకంటే నిద్ర నోటి వాసనలో అనివార్యంగా మార్పును తీసుకు వస్తుంది. మరియు మిస్‌వాక్ నోటిని శుభ్రపరిచే ఒక మంచి సాధనం.
- పై అర్థములో, నోటి వాసనలో అయిష్టకరమైన, అప్రీతికరమైన మార్పును గమనించిన ప్రతిసారీ మిస్వాక్ చేయుట కూడా షరియత్ లోని భాగమే.
- ప్రత్యేక సందర్భాలలో పరిశుభ్రతను పాటించడం మాత్రమే కాకుండా, సాధారణ పరిశుభ్రతకు షరియత్ యొక్క చట్టబద్ధత ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్నది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ లో ఉన్న విషయం మరియు ఇది ఒక ఉత్క్రుష్టమైన వ్యవహరణ.
- మిస్వాక్’తో నోటిని పూర్తిగా శుభ్రపరుచుకోవడం: అంటే పళ్ళూ, చిగుళ్లు మరియు నాలుక ఇవన్ని శుభ్రపరుచుకోవడం ఇందులో భాగాలు.
- ‘సివాక్’ అంటే ‘అరక్’ వృక్షమునుండి కతిరించిన ఒక చిన్న ముక్క; లేదా ఏ వృక్షము నుండి అయినా కత్తిరించబడిన అటువంటి ముక్క కూడా సివాక్ అనబడుతుంది. అది నోటిని, పళ్ళను శుభ్రపరుచు కోవడానికి ఉపయోగించ బడుతుంది, తద్వారా నోటిని తాజాగా ఉంచుతుంది, మరియు చెడు వాసనలు తొలగిస్తుంది.