- ఈ హదీసులో మనకు పరిశుభ్రత మరియు స్వచ్ఛత పట్ల ఇస్లాం యొక్క శ్రద్ధ మరియు ఆసక్తి తెలుస్తున్నాయి.
- శుక్రవారము నాడు నమాజు కొరకు తల స్నానము చేయుట ‘నొక్కి చెప్పబడిన ముస్తహబ్ ఆచరణ’
- హదీసులో శరీరము కడుగుట పేర్కొనబడినప్పటికీ, తల కడుగుట ప్రత్యేకంగా పేర్కొనబడినది, కారణం శరీరముతో పాటు తలను కడుగుట పట్ల కూడా శ్రద్ధ వహించమని.
- ఒకవేళ ఎవరి నుండైనా అప్రీతికరమైన వాసన వస్తూ ఉండి, ఇతరులకు అసౌకర్యం కలిగేలా ఉంటే అలాంటి వ్యక్తి ‘గుసుల్’ (స్నానం) చేయడం తప్పనిసరి అవుతుంది (వాజిబ్ అవుతుంది).
- గుసుల్ చేయుట యొక్క ఘనత పొందుట కొరకు నిర్దేశించబడిన దినము శుక్రవారము.