- ఈ హదీసులో అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత తెలుస్తున్నది – ఆ విషయం పట్ల ఆయన సిగ్గు పడటం, వేరొకరి ద్వారానైనా ప్రశ్నించడం నుండి ఆయనను దూరంగా ఉంచలేదు.
- ఈ హదీసు ద్వారా మన తరఫున ప్రశ్నించడానికి ఎవరినైనా మనం నియమించుకొన వచ్చును అనడానికి అనుమతి లభిస్తున్నది.
- తాను సిగ్గు పడుతున్న తనకు సంబంధించిన ఏదైనా విషయాన్ని గురించి, ప్రజల బహుళ ప్రయోజనం కొరకు బహిరంగపరుచుట అనుమతించబడిన విషయమే.
- మదీ (‘స్ఖలన పూర్వ ద్రవం’) అనేది అశుద్ధమైనదని, దానిని బట్టల నుండి మరియు శరీరానికి అంటుకుని ఉంటే శరీరం నుండి నీటితో కడిగి దూరం చేయాలి అని తెలుస్తున్నది.
- మదీ (‘స్ఖలన పూర్వ ద్రవం’) విడుదల కావడం అనేది వుదూను భంగ పరిచే విషయాలలో ఒకటి.
- మరొక హదీసులో పేర్కొనట్టు, శుభ్రపరుచునపుడు పురుషాంగాన్ని మరియు వృషణాలను కూడా కడగాలి.