/ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”...

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”...

అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

కొన్నిసార్లు ఉదూ చేయునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో కడగవలసిన శరీర భాగాలను రెండేసి మార్లు కడిగేవారు – అంటే ముఖాన్ని, నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపర్చడంతో సహా – రెండు సార్లు కడిగినారు, అలాగే చేతులను, కాళ్ళను రెండుసార్లు కడిగి శుభ్రపరుచుకున్నారు.

Hadeeth benefits

  1. (వుజూలో) శరీర భాగాలను కనీసం ఒక్కసారి కడుగుట వాజిబ్ (విధి), అంతకంటే ఎక్కువ సార్లు కడుగుట ముస్తహబ్ (అభిలషణీయము).
  2. కొన్నిసార్లు (వుజూలో) రెండు రెండు సార్లు శరీర భాగాలు కడుగుటకు అనుమతి ఉంది.
  3. అయితే తడి చేతులతో తలను తడుముట (తల యొక్క మసహ్ చేయుట) ఒక్కసారే చేయబడుతుంది.