- నిద్ర నుండి లేవకపోయినా ఉదూ చేయడానికి ముందు నీళ్ళు ఉన్న పాత్రలో చేయి పెట్టడానికి ముందు చేతులను బాగా కడుగుకొనుట అభిలషణీయము. అదే నిద్ర నుంచి లేచి నట్లయితే ముందుగా చేతులు కడుక్కోవడం తప్పనిసరి అవుతుంది.
- ఉపాధ్యాయుడు విద్యతో పాటుగా, విద్యార్థులలో తాను బోధించే విషయం పట్ల అవగాహన, మరియు ఙ్ఞానము ఏకీకృతము అవుట కొరకు దగ్గరి మార్గమును ఎంచుకోవాలి.
- నమాజు ఆచరించే వ్యక్తి తన ప్రాపంచిక జీవితానికి సంబంధించిన విషయాల ఆలోచనలను పూర్తిగా దూరంగా ఉంచాలి. నమాజు యొక్క సంపూర్ణత మరియు పరిపూర్ణత, నమాజులో తన హృదయాన్ని కేంద్రీకరించడములో ఉన్నది. అలా కేంద్రీకరించ లేకపోతే ఆలోచనల నుండి తప్పించుకోవడం అసాధ్యమవుతుంది. కనుక నమాజు ఆచరించే వ్యక్తి (తన మనసును కట్టడిలో ఉంచుకొనుటకు) తనపై తాను జిహాదు చేయాలి; ఊహలలో పడి కొట్టుకుని పోరాదు.
- ఇందులో వుజూ చేయునపుడు కుడి వైపు నుండి ప్రారంభించుట యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.
- ఇందులో (నోటిలోని మరియు ముక్కులోని) మాలిన్యము దూరం చేసుకునే షరయీ క్రమము వివరించబడినది. ముందుగా నోటిని శుభ్రపరుచుకోవడం, తరువాత ముక్కులోనికి నీటిని తీసుకుని (ఇస్తిన్’షాఖ్), తరువాత ముక్కును చీది శుభ్రపరుచుకోవడం (ఇస్తిన్’సార్).
- ముఖము, చేతులు మరియు పాదములను మూడేసి సార్లు కడుగుట అభిలషణీయము, అయితే కనీసం ఒకసారి కడుగుట విధి (తప్పనిసరి).
- ఈ హదీసులో అల్లాహ్ మన పూర్వపు పాపాలు క్షమించడం అనేది రెండు ఆచరణల కలయికపై ఆధారపడి ఉన్నది: హదీథులో వివరించబడిన విధంగా (పరిపూర్ణంగా) ఉదూ చేయడం, మరియు వెంటనే రెండు రకాతుల నమాజు ఆచరించడం.
- వుజూలో భాగమైన ప్రతి శరీర భాగానికి హద్దులున్నాయి: ముఖము యొక్క హద్దులు: ముఖము అంటే పొడవులో తలపై వెంట్రుకలు మొదలయ్యే భాగము నుండి (ఫాల భాగము లేదా నుదుటి నుండి) మొదలుకుని గడ్డము క్రింది వరకు, వెడల్పులో ఒక చెవి నుండి మొదలుకుని మరో చెవి వరకు; చేతి హద్దులు: చేతి వేళ్ళ చివరల నుండి మొదలుకుని, మోచేతి వరకు – అంటే ముంజేతికి మరియు జబ్బ (లేక బాహువు) కు మధ్యలో ఉండే కీలు వరకు; తల యొక్క హద్దులు: నుదురు పైభాగమున వెంట్రుకలు మొలిచే ప్రదేశమునుండి మొదలుకుని తల యొక్క రెండు పార్శ్వములు మరియు మెడ పైభాగము వరకు, తడి వేళ్ళతో చెవులను తుడవడంతో సహా, పాదము హద్దులు: పాదము మొత్తము, అంటే పాదానికి మరియు కాలి పిక్కకు మధ్యన ఉండే కీలు (చీలమండలం) వరకు.