- ఇందులో అల్లాహ్ ఇష్టపడే ప్రవక్తల సున్నతుల యొక్క ప్రస్తావన ఉన్నది. వాటి పరిపూర్ణత కొరకు, తద్వారా స్వీయ సౌందర్యము (పరిశుద్ధత) కొరకు వాటిని ఆచరించమని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు.
- ఈ హదీసులో - ఈ విషయాలను ఆచరణలో పెట్టాలని, వాటిని నిర్లక్ష్యం చేయరాదనే సూచన ఉన్నది.
- ఈ ఆచరణలలో ప్రాపంచిక ప్రయోజనాలు మరియు ధార్మిక ప్రతిఫలాలు ఉన్నాయి. ఉదాహరణకు రూపము సౌందర్యవంతమగుట, శారీరక పరిశుభ్రత, పరిశుద్ధతల గురించి అప్రమత్తంగా మరియు సావధానంగా ఉండుట, (ఈ విషయాలలో) అవిశ్వాసులను వ్యతిరేకించుట, మరియు అల్లాహ్ యొక్క ఆదేశపాలన చేయుట.
- ఈ హదీసులో పేర్కొన్న ఐదు గాక వేరే హదీసులలో సహజసిద్ధ (స్వాభావిక) ఆచారాలు / ఆచరణలుగా అదనంగా మరికొన్ని ఆచారాలను / ఆచరణలను పేర్కొనుట జరిగినది – అవి గడ్డము పెంచుట, పలుదోము పుల్ల (మిస్వాక్’) ఉపయోగించుట మొదలైనవి.