- వ్యక్తుల మధ్య విభేదాలు మరియు చీలికలను కలిగించే, ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఇతరుల మాటలను ప్రసారం చేయడం, మరియు మూత్రపు చుక్కలు చింది మీద పడకుండా జాగ్రత్త వహించకపోవడం అనేవి సమాధిలో శిక్షకు గురి చేసే కారణాలలో ఒకటి.
- అల్లాహ్ యొక్క ప్రవక్త అనే నిదర్శనాలలో భాగంగా, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు కొన్ని అగోచర విషయాలను (కంటికి కనిపించని విషయాలను) బహిర్గతం చేసేవారు – ఉదాహరణకు సమాధిలో విధించబడే శిక్ష.
- చెట్టు యొక్క రెమ్మను విరిచి, రెండు భాగాలుగా చేసి వాటిని రెండు సమాధులపై ఉంచడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే ప్రత్యేకం. ఎందుకంటే ఆ సమాధులలో ఉన్న వారి పరిస్థితిని గురించిన సమాచారాన్నిఅల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు తెలియజేసినాడు. కనుక మరింకెవ్వరికీ ప్రత్యేకం కాదు, ఎందుకంటే సమాధులలో ఉన్నవారి పరిస్తితి ఏమిటో ఎవ్వరూ ఎరుగరు.