/ “సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది...

“సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది...

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది".

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ‘అరాక్ చెట్టు’ యొక్క పుల్లను లేదా అటువంటి చెట్ల పుల్లను ఉపయోగించి పళ్ళను శుభ్రపరుచుకోవడం నోటిని మాలిన్యము నుండి మరియు దుర్గంధము నుండి శుభ్రపరుస్తుంది’ అని తెలియజేస్తున్నారు. మరియు ఈ విధంగా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం తన దాసుని పట్ల అల్లాహ్ ప్రసన్నుడు కావడానికి ఒక కారణం అవుతుంది. ఎందుకంటే, ఇందులో అల్లాహ్ పట్ల దాసుని విధేయత మరియు ఆయన ఆఙ్ఞను శిరసావహించడమూ ఉన్నాయి, అలాగే సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఇష్టపడే పరిశుభ్రత కూడా ఉన్నది.

Hadeeth benefits

  1. ఇందులో, (సివాక్ ఉపయోగించి) పళ్ళు దోముకుని నోటిని శుభ్రంగా ఉంచుకోవడం యొక్క ఘనత మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను (సమాజాన్ని) ఎక్కువగా ప్రోత్సహించడం స్పష్టమవు తున్నాయి.
  2. పంటి పుల్లలలో అత్యంత ఉత్తమమైనది అరాక్ చెట్టు యొక్క పుల్ల. అయితే, (అది లభ్యం కానట్లయితే) దాని స్థానములో టూత్’బ్రష్ మరియు పేస్ట్ కూడా ఉపయోగించ వచ్చును.