అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్ల...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కు “తషహ్హుద్” పఠించడాన్ని నేర్పించినారు. అది నమాజులో పఠించబడుతుంది. ఇబ్న్...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్...
నమాజులో చివరి (రకాతులో) తషహ్హుద్ పూర్తి అయిన తరువాత, సలాముతో నమాజు ముగించుటకు ముందు నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ దుఆ చేసేవారు; మరియు...
మఅదాన్ ఇబ్నె అబీ తల్హహ్ అల్ యఅమరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత బానిసత్వము నుండి విముక్తి పొందిన సౌబాన్ రజియల్ల...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను స్వర్గములోనికి ప్రవేశించడానికి కారణమయ్యే ఆచరణలు ఏవి లేక అల్లాహ్’కు ఇష్టమైన ఆచరణలు ఏవి? అని ప్రశ్నించడం జరిగింది....
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (...
భోజనము వడ్డించి ఉన్నపుడు సలాహ్ ఆచరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, ఎందుకంటే సలాహ్ ఆచరిస్తున్న వానిలో ఆ ఆహారాన్ని భుజించాలనే అప...
ఉస్మాన్ ఇబ్న్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఇలా అన్నారని ఉల్లేఖిస్తున్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహ...
ఉస్మాన్ బిన్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! నాకు నా సలాహ్’కు (నమాజుకు) మధ్య షైతాన్ వచ్చి...

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”. (కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).

మఅదాన్ ఇబ్నె అబీ తల్హహ్ అల్ యఅమరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత బానిసత్వము నుండి విముక్తి పొందిన సౌబాన్ రజియల్లాహు అన్హు కలిసి ఇలా అడిగాను: “నాకు ఒక ఆచరణను గురించి తెలియ జేయండి, దేనిని నేను ఆచరించినట్లయితే దాని ద్వారా అల్లాహ్ నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడో” లేక బహుశా నేను ఇలా అన్నాను: “”అల్లాహ్ అమితంగా ఇష్టపడే ఆచరణలు ఏమిటి?” ఆయన మౌనంగా ఉండిపోయాడు. నేను మళ్ళీ ప్రశ్నించాను, ఆయన మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు, నేను మూడోసారి మళ్ళీ ప్రశ్నించాను. దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను ఇదే విధంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించాను. దానికి ఆయన: “అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు”. మఅదాన్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “తరువాత నేను అబూ దర్దా రజియల్లాహు అన్హు ను కలిసాను. ఆయనను కూడా ప్రశ్నించాను. ఆయన కూడా సౌబాన్ రజియల్లాహు అన్హు పలికిన మాదిరిగానే పలికారు.”

ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”

ఉస్మాన్ ఇబ్న్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఇలా అన్నారని ఉల్లేఖిస్తున్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నిశ్చయంగా షైతాన్ నాకూ, నా సలాహ్’కు (నమాజుకు), మరియు (నమాజులో) నా ఖుర్’ఆన్ పఠనానికి మధ్య వస్తున్నాడు, నా ఏకాగ్రతను భంగపరుస్తున్నాడు.” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు మూడు సార్లు (ప్రతీకాత్మకంగా) ఉమ్మివేయి.” నేను అలాగే చేసాను. అల్లాహ్ వాడిని నా నుండి దూరం చేసినాడు.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రజలలో అతి చెడ్డగా దొంగతనం చేసేవాడు ఎవరంటే, ఎవరైతే తన సలాహ్ ను దొంగిలిస్తాడో. అక్కడున్న వారు ప్రశ్నించారు “సలాహ్ ను ఎలా దొంగిలిస్తాడు?” దానికి ఆయన ఇలా అన్నారు “అతడు తన రుకూను సంపూర్ణంగా ఆచరించడు, మరియు తన సజ్దాహ్’లను ను సంపూర్ణంగా ఆచరించడు (త్వరత్వరగా చేస్తాడు)”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా చేస్తాడని లేక అతడి ఆకృతిని గాడిద మాదిరిగా చేస్తాడని?”

అబూ సఈద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి. ఒకవేళ అతడు 5 రకాతులు చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు అతడి నమాజు ను (సరి సంఖ్యగా) పరిపూర్ణం చేస్తాయి. ఒకవేళ అతడు నాలుగు (రకాతులు) చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు షైతానుకు పరాభవంగా మారుతాయి.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవిలో షైతాను మూత్రము పోసినాడు అనో అన్నారు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సూర్యుడు ఉదయించే దినములలో ఉత్తమమైన దినము ‘శుక్రవారము’. శుక్రవారమునాడే ఆదం అలైహిస్సలాం సృష్టించబడినారు; శుక్రవారమునాడే ఆయన స్వర్గములో ప్రవేశింపజేయబడినారు, శుక్రవారమునాడే ఆయన దాని నుండి బయటకు తీయబడినారు; మరియు శుక్రవారమునాడు తప్ప ప్రళయ ఘడియ స్థాపించబడదు.”

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”

సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)