- నమాజులో తషహ్హుద్ యొక్క స్థానము – నమాజులో చివరి సజ్దాహ్ ఆచరించిన తరువాత, మరియు మూడు రకాతుల, నాలుగు రకాతుల నమాజులలో రెండవ రకాతు తరువాత.
- తషహ్హుద్ లో శుభకరమైన పదాలు (అత్తహియ్యాత్) పలుకుట విధి. (తషహ్హుద్’కు సంబంధించిన) సహీహ్ హదీథులలో ఉల్లేఖించబడిన ‘తహియ్యాత్’ పదాలలొ వేటినైనా ఉచ్ఛరించవచ్చును అనడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆధారాలు ఉన్నాయి.
- పాపపు పని లేక తప్పుడు పనికి చెందిన దుఆ చేయుట నిషేధము (హరాం). అలా కాక నమాజు ఆచరిస్తున్న వ్యక్తి, నమాజులో తనకు ఇష్టమైన ఏ దుఆనైనా చేయవచ్చును.
- (పైకి వినబడేలా కాకుండా) దుఆ మనసులో చేయుట అభిలషణీయము.