- ఈ హదీసు ద్వారా – సలాహ్’లో (నమాజులో) వినయము మరియు హృదయాన్ని లగ్నం చేసి ఆచరించుట యొక్క ప్రాధాన్యత తెలుస్తునది. అలాగే షైతాను నమాజులో పలురకాలుగా ధ్యానాన్ని మళ్ళించడానికి, సందేహాలు రేకెత్తించడానికి మరియు గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని తెలుస్తున్నది.
- నమాజులో ఉండగా షైతాను మనసులో పలురకాల ఆలోచనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తే వెంటనే అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, అలాగే (ప్రతీకాత్మకంగా) ఎడమచేతి వైపునకు మూడు సార్లు ఉమ్మి వేయాలి.
- తమకు ఎదురైన ఏ పరిస్థితికైనా, ఏ సమస్య లేక సందేహానికైనా సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి చేరి వారి ముందు ఉంచేవారు. వారు దానికి పరిష్కారాన్ని చూపేవారు.
- అంతిమ దినపు ఆలోచనతోనే సహబాల హృదయాలు ఎప్పుడూ సజీవంగా ఉండేవి.