“భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”...
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
వివరణ
భోజనము వడ్డించి ఉన్నపుడు సలాహ్ ఆచరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, ఎందుకంటే సలాహ్ ఆచరిస్తున్న వానిలో ఆ ఆహారాన్ని భుజించాలనే అపేక్ష ఉంటుంది, అతని మనసు ఆ వడ్డించబడి ఉన్న ఆహారానికే అంటుకుని ఉంటుంది.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు అశుద్ధ విషయాలను, విడుదల చేయవలసిన తీవ్ర అవసరం ఉన్నప్పటికీ, వాటిని ఆపి ఉంచుకుని సలాహ్ ఆచరించుటను నిషేధించినారు. అవి ఒకటి మూత్ర విసర్జన, రెండు మలవిసర్జన. ఎందుకంటే అతడి ధ్యానము వాటిని ఆపి ఉంచుకొనుటకు చేసే ప్రయత్నం పైనే ఉంటుంది.
Hadeeth benefits
ఇందులో నమాజు ఆచరించే వ్యక్తి, నమాజులో ప్రవేశించక ముందే – నమాజు నుండి అతని ధ్యానాన్ని మరలించే ప్రతి విషయాన్ని దూరంగా ఉంచాలని అర్థమవుతున్నది.
Share
Use the QR code to easily share the message of Islam with others