- ఇందులో శుక్రవారము నాడు, నమాజు కొరకు వెళ్ళడానికి ముందు సంపూర్ణంగా గుస్ల్ ఆచరించడం ప్రోత్సహించబడింది.
- శుక్రవారము నాడు మస్జిదునకు త్వరగా వెళ్ళుట యొక్క ఘనత మొదటి ఘడియ నుండే ప్రారంభమవుతుంది.
- మంచి పనులు చేయుటకు ముందడుగు వేయాలని ఈ హదీథులో ప్రోత్సాహం, హితబోధ ఉన్నది.
- ఈ హదీథు ద్వారా – దైవదూతలు శుక్రవారపు నమాజునకు హాజరవుతాని, ఇమాం యొక్క ఖుత్బా వింటారని తెలియుచున్నది.
- దైవదూతలు మస్జిదు యొక్క ద్వారముల వద్ద ఉంటారు – శుక్రవారపు నమాజు కొరకు ఎవరెవరు ముందుగా వచ్చినారో నమోదు చేస్తూ ఉంటారు.
- ఇమాం ఇబ్న్ రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో “ఎవరైతే శుక్రవారము నాడు గుస్ల్ ఆచరించి మస్జిదుకు బయలుదేరతారో....” అనే మాటలు, శుక్రవారము నాటి ప్రత్యేక గుస్ల్ సమయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి మొదలై, అతడు మస్జిదునకు బయలుదేరే ముందు వరకు ఉంటుంది అనే విషయాన్ని సూచిస్తున్నాయి.