- ఇమామును అనుసరించే వానికి సంబంధించి నాలుగు పరిస్థితులను చూడవచ్చు, వాటిలో మూడు నిషేధము. అవి ఇమాముతో పోటీ పడుతున్నట్లుగా ఆచరించడం, ఇమాముతో పాటుగా ఆచరించడం, లేదా ఆచరించడంలో బాగా ఆలస్యం చేయడం. ఇవి మూడు కూడా నిషేధమే. ఇమాము వెనుక నమాజు ఆచరించే వానికి అనుమతించబడిన విషయం ఏమిటంటే – ఇమామును అనుసరించడం.
- కనుక నమాజులో ఇమాము వెనుక ఉన్న నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ఇమామును అనుసరించుట అతనిపై విధి (ఇమాము ఆచరించిన ‘పిదప’, ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించుట).
- ఇందులో – ఇమాము కంటే ముందు తల పైకి ఎత్తే వాని తలను లేదా ఆకారాన్ని గాడిద తల మాదిరిగా లేక గాడిద ఆకారం మాదిరిగా మార్చడం అనే తీవ్రమైన హెచ్చరిక ఏదైతే ఉన్నదో – అలా జరగడం అన్నివిధాలా సాధ్యమే; అతడు అలా రూపాంతరం చెందిన వాడు అవుతాడు.