- ఒక వ్యక్తి తన నమాజు గురించి సందేహంలో ఉంటే, మరియు రెండు విషయాలలో ఏది వాస్తవమైనదో ఖచ్చితంగా తెలియకపోతే, అతను తన సందేహాన్ని విస్మరించి, ఖచ్చితమైనదిగా భావించిన దానిపై అమలుచేయాలి; నిశ్చయంగా ఇది తక్కువ సంఖ్యయే అవుతుంది. ఆ విధంగా అతడు తన నమాజును పూర్తి చేసి, సలాం చెప్పే ముందు రెండు సజ్దాలు (సజ్దహ్ అస్’సహ్వ్) చేయాలి, అపుడు సలాంతో నమాజును ముగించాలి.
- ఈ రెండు సజ్దాలు నమాజు యొక్క పరిపూర్ణతకు, మరియు షైతాన్’ను పరాభవంతో అతడి లక్ష్యం నుండి అతడిని దూరంగా తరిమివేయడానికి ఒక మార్గం.
- ఈ హదీసులో ప్రస్తావించబడిన సందేహం లేక అనుమానం ఏదైతే ఉందో అది వాస్తవానికి ‘ఖచ్చితత్వం లేని’ ఒక అయోమయ స్థితి. కనుక అటువంటి స్థితిలో పడిపోతే, ఖచ్చితత్వానికి దగ్గరగా ఉన్న దానిపై అమలు చేయాలి.
- అలాగే ఈ హదీసులో సందేహాలను, అనుమానాలను షరియత్ (లో అల్లాహ్ యొక్క) ఆదేశాలను పాటించడం ద్వారా దూరం చేసుకోవాలి అనే హితబోధ ఉన్నది.