- ఇందులో ముస్లింలు విధిగా ఆచరించవలసిన (ఫర్జ్) నమాజులను, మరియు స్వచ్ఛంద నమాజులను (సున్నత్ మరియు నఫీల్) నిర్వహించడంలో ఆసక్తి చూపాలని కోరడం జరిగింది, ఎందుకంటే వాటి ద్వారానే ఎక్కువ సజ్దహ్’లు చేయడం జరుగుతుంది.
- అలాగే ఇందులో సహాబాల యొక్క ధర్మావగాహనకు సంబంధించి ప్రస్తావన ఉన్నది – అల్లాహ్ యొక్క కృప మరియు కరుణ తరువాత – స్వర్గం లోనికి ప్రవేశం కేవలం ఆచరణల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
- అల్లాహ్’కు సజ్దాహ్ చేయడం అనేది (ఇహపరలోకాలలో) మన స్థాయి ఉన్నతం కావడానికి మరియు పాప క్షమాపణకు ఒక గొప్ప మార్గము.