- ఈ హదీసులో పేర్కొనబడిన విధంగా అల్లాహ్ యొక్క రక్షణ కోరడం అనేది దుఆలలో అతి ముఖ్యమైనది, ఎందుకంటే ఈ దుఆలో ఈ ఇహలోకపు మరియు పరలోకపు ఉపద్రవాలు, శిక్షలు మరియు పరీక్షలనుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరడం జరుగుతున్నది.
- ఇందులో సమాధి శిక్ష ఉన్నది అనడానికి రుజువు ఉన్నది, మరియు అది (సమాధి శిక్ష) సత్యము.
- అలాగే ఇందులో వ్యామోహాల ప్రమాదము గురించి, మరియు వాటి నుండి తప్పించుకోవడానికి అల్లాహ్ యొక్క రక్షణ కోరుట యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుస్తున్నది.
- ఇందులో ఈ ప్రపంచపు అంతిమ దినములలో ‘దజ్జాల్’ రావడం సత్యము అనడానికి, మరియు అతడి రాక వల్ల ఉద్భవించే ఉపద్రవం, మార్గభ్రష్ఠత్వం చాలా పెద్ది అనడానికి రుజువు ఉన్నది
- నమాజులో చివరి తషహ్హుద్ తరువాత ఈ దుఆ పఠించడం అభిలషణీయము.
- అలాగే ఏదైనా సత్కార్యము (మంచి పని) చేసిన వెంటనే ఈ దుఆ పఠించుట కూడా అభిలషణీయము.