- ఈ హదీసు ద్వారా మిగతా అన్ని దినములపై శుక్రవారము యొక్క ఘనత తెలియుచున్నది.
- ఈ హదీసులో శుక్రవారము నాడు ఎక్కువగా సత్కార్యాలు ఆచరించుటకు, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణను పొందుటకు సిద్ధము కావలెనని; తద్వారా అల్లాహ్ యొక్క ఆగ్రము నుండి రక్షణ పొందవలెననే ప్రోత్సాహము ఉన్నది.
- ఈ హదీసులో పేర్కొనబడిన శుక్రవారము యొక్క ప్రత్యేకతలను గురించి కొంతమంది ఉలెమా ఇలా అన్నారు: ‘ఆ ప్రత్యేకతలు ఉల్లేఖించబడినది శుక్రవారము యొక్క ఘనతను గురించి కాదు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం స్వర్గము నుండి బయటకు తీయబడం, ప్రళయ ఘడియ స్థాపించబడడం శుభప్రదమైన విషయాలు కావు కదా. మరికొంత మంది ఉలెమాలు ఇలా అన్నారు: వాస్తవానికి, అవన్నీ శుభాలే, ఘనమైన విషయాలే. ఆదం అలైహిస్సలాం ఉనికి భూమిపై అల్లాహ్ యొక్క సందేశహరుల, ప్రవక్తల మరియు సత్పురుషుల ఆవిర్భావానికి కారణమయ్యింది. అలాగే అటువంటి సత్పురుషుల ప్రతిఫలాన్ని వేగవంతం చేయుటకు, మరియు వారి కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచిన గౌరవాలను వారికి ప్రసాదించుటను వేగవంతం చేయుటకు – ప్రళయఘడియ ఆవిర్భావం ఒక కారణం.
- ఈ హదీథులో పేర్కొనబడిన ప్రత్యేకతలు మరియు ఘనతలే కాక శుక్రవారానికి సంబంధించి మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, అవి: శుక్రవారము నాడే ఆదం అలైహిస్సలాం క్షమించబడినారు; శుక్రవారమునాడే ఆయన మరణించినారు; అలాగే శుక్రవారము నాడు ఒక ప్రత్యేకమైన ఘడియ ఉన్నది – ఆ ఘడియలో ఏ ముస్లిం విశ్వాసి అయినా నమాజు ఆచరించి అల్లాహ్’ను ఏదైనా కోరితే, అల్లాహ్ అతనికి దానిని ప్రసాదించకుండా ఉండడు.
- సంవత్సరములో అన్నింటి కంటే ఉత్తమమైన దినము “అరఫా దినము”; అలాగే హజ్’లో ‘ఖుర్బానీ’ చేయు దినము కూడా ఉత్తమమైనదిగా భావిస్తారు; వారములో ఉత్తమమైన దినము శుక్రవారము; మరియు రాత్రులలోఉత్తమమైన రాత్రి – లైలతుల్ ఖద్ర్ రాత్రి.