- షైతాను కారణంగా “ఖియాముల్లయిల్”ను (రాత్రి నమాజును) వదిలి వేయడం పట్ల ఇందులో అయిష్టత ఉన్నది. అది గర్హనీయమని తెలియుచున్నది.
- విశ్వాసికి మరియు అల్లాహ్ పట్ల అతని విధేయతకు మధ్య షైతాను సాధ్యమైన అన్ని మార్గాలలో కాచుకుని ఉంటాడు. వాని పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇందులో “నమాజు కొరకు లేవకుండా” అనే అతని మాటలు, నమాజు యొక్క రకాన్ని సూచిస్తున్నాయి – అది ఒక ఒడంబడిక కావచ్చు; అంటే “ఖియాముల్లయిల్” (రాత్రి నమాజు), లేదా అతడు విధిగా ఆచరించవలసిన నమాజు కావచ్చు.
- అత్’తయ్యిబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: నిద్ర యొక్క తీవ్రతను సూచించడానికి కళ్ళను ప్రస్తావించడం మరింత సముచితం అయినప్పటికీ, ఆయన (స) ప్రత్యేకంగా చెవులను ప్రస్తావించారు; ఎందుకంటే ఏదైనా విషయావగాహనలో శ్రద్ధను కనబరిచే మూలాలు చెవులు గనుక. అలాగే మూత్రమును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, ఎందుకంటే అది ప్రవేశించనలవి ఉన్న ఖాళీ ప్రదేశాలన్నింటిలోను తేలికగా, త్వరగా ప్రవేశిస్తుంది, మరియు సిరలలోనికి అతి త్వరగా చొచ్చుకునిపోయి, శరీరపు అంగాలన్నింటినీ సోమరిగా మార్చివేస్తుంది.